Kadapa: కడపలో స్థానిక ఎన్నికలకు 2,350 మందితో పటిష్ట భద్రత ఎస్పీ

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 2,350 మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రత. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా అని తెలిపిన ఎస్పీ నచికేత్.

G. RAVI KUMAR, KADAPA
Published on: 4 Nov 2026 10:00 PM IST
Kadapa
X

Kadapa: కడపలో స్థానిక ఎన్నికలకు 2,350 మందితో పటిష్ట భద్రత ఎస్పీ

కడప: నవంబర్ 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇద్దరు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 47 మంది సీఐలు, 71 మంది ఎస్ఐలు సహా మొత్తం 2,350 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఎన్నికల బందోబస్తుకు కేటాయించారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

మరోవైపు ఎన్నికల సమయంలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఓటు హక్కు లేని ఇతర ప్రాంతాల వ్యక్తులు ప్రవేశించడానికి అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA