Jammalamadugu: బీసీలకు 34% రిజర్వేషన్లపై టీడీపీ అధ్యక్షులు భూపేష్‌

Jammalamadugu: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 2 Oct 2026 8:15 PM IST
Jammalamadugu
X

Jammalamadugu: బీసీలకు 34% రిజర్వేషన్లపై టీడీపీ అధ్యక్షులు భూపేష్‌

జమ్మలమడుగు: కడప జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 105, 1065 జారీ చేస్తే వైసిపి నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు.

ఎన్నికలు జరగకూడదు బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారు. బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం వైసిపి హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారు. ఇప్పుడు కూడా పదవులు రాకూడదని కుట్రతో కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా ఆడుకున్నారు. బీసీలను రాజ్యాధికారంలో బాగా స్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది.

ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదు బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20% 1995లో 34% రిజర్వేషన్లు కల్పించాం. బీసీలకు రాజకీయ సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ లోనే ఉంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు , జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్, రామయ్య, చలపతి, పాండులు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు సిద్దు,రామంజిల్ పాల్గొన్నారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU