Kadapa: జమ్మలమడుగులో రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం!

Kadapa: జమ్మలమడుగులో రూ.35.27 కోట్లతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు భూపేష్ ప్రారంభించారు. తొలి విడత టిడ్కో ఇళ్ల అందజేత.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 30 Sept 2026 8:59 AM IST
Kadapa
X

Kadapa: జమ్మలమడుగులో రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం!

Kadapa: కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు.

దాదాపు 35.27 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలో రోడ్లు, కాలువలు, పైపులైన్ల అభివృద్ధి పనులతో పాటు పెద్దపసువుల రోడ్డులో అర్జన్ హెల్త్ సెంటర్‌,సమగ్ర నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం జమ్మలమడుగు మండలం గూడెంచెరువు సమీపంలో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మించిన 1,450 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 520 ఇళ్లను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో, ఎన్టీఆర్ గృహాలతో పాటు వేలాది ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

అభివృద్ధి అన్ని రంగాల్లో కొనసాగాలని పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఐదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU