Jammalamadugu: రూ.22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Jammalamadugu: జమ్మలమడుగులో రూ.22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కుప్పం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్ ప్రారంభోత్సవం, హాజరైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.
Jammalamadugu: రూ.22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో హ్యమ్ పథకంలో భాగంగా 22 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగాన్ని విన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి ఇవాళ కుప్పం నుంచి వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ప్రధానంగా రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడం ఈ కొత్త పథకం ప్రధాన ఉద్దేశం. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీకు 16 కోట్లు , జమ్మలమడుగు మున్సిపాలిటీకు సంబంధించి 22 కోట్ల రూపాయలకు సంబందించిన అభివృద్ధి పనులు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగి పోయాయని గుర్తు చేశారు. సమస్యలు, సంక్షేమాన్ని వదిలేసి... డబ్బులన్నీ పోగు చేసుకుని ఆయన మాత్రం కుబేరుడయ్యారన్నారు.
ప్రతి పనికి అడ్డు తగులుతూ అభివృద్ధి నిరోధకుడుగా మారుతున్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని...రెండు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి పల్లె పట్టణంలా... మారాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అని అందుకు తగ్గట్టు మనం సహకరించాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పులివెందులకు చెక్ పెడతామని మరోమారు స్పష్టం చేశారు.




