Jammalamadugu: జమ్మలమడుగు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా చదిపిరాళ్ల జ్యోతి నామినేషన్!

Jammalamadugu: జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల జ్యోతి భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణాభివృద్ధే ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 18 Oct 2026 1:05 PM IST
Jammalamadugu
X

Jammalamadugu: జమ్మలమడుగు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా చదిపిరాళ్ల జ్యోతి నామినేషన్!

జమ్మలమడుగు: కడప జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతి ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జమ్మలమడుగు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పట్టణ ప్రజలందరూ తనకు మద్దతుగా నిలిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జనసేన నాయకుడు నల్లంశెట్టి నాగార్జునతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU