Jammalamadugu: జమ్మలమడుగులో రూ. 5 లక్షలకు వినాయకుడి లడ్డూ వేలం!
Jammalamadugu: జమ్మలమడుగులో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ. 9 కేజీల స్వామివారి ప్రసాదాన్ని రూ.5 లక్షలకు దక్కించుకున్న మైసూరు సుబ్బారావు కుటుంబం.
Jammalamadugu: జమ్మలమడుగులో రూ. 5 లక్షలకు వినాయకుడి లడ్డూ వేలం!
Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని రజక వీధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకదంత యూత్ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినాయకుడిని మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
స్వామివారి వద్ద ఉంచిన 9 కిలోల లడ్డూకు వేలం నిర్వహించగా పోటాపోటీగా సాగిన వేలం చివరకు రూ.5 లక్షల వద్ద ముగిసింది. మైసూరు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. కాగా, గత ఏడాది ఇదే స్వామివారి లడ్డూ రూ.3 లక్షల 60 వేల ధరకు వేలంలో విక్రయమైనట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది ధరతో పోలిస్తే ఈసారి లడ్డూ వేలం ధర గణనీయంగా పెరిగింది.గణేశుని ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలనే ఉద్దేశంతోనే లడ్డూను వేలంలో పాడుకున్నామని సుబ్బారావు కుటుంబ సభ్యులు తెలిపారు.




