Jammalamadugu: మా మొదటి ప్రాధాన్యత రైతుల సంక్షేమమే - ఎమ్మెల్యే
Jammalamadugu: రైతుల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ ఉప్పలపాడులో శ్రీ సిమెంట్ ఏర్పాటుపై సదస్సు నిర్వహించారు.
Jammalamadugu: మా మొదటి ప్రాధాన్యత రైతుల సంక్షేమమే - ఎమ్మెల్యే
జమ్మలమడుగు: మా మొదటి ప్రాధాన్యత రైతుల సంక్షేమమని, రెండో ప్రాధాన్యత పరిశ్రమల ఏర్పాటని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బుధవారం కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలో శ్రీ సిమెంట్ కర్మాగారం యాజమాన్యం, గ్రామ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా టిడిపి అధ్యక్షులు భూపేష్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్. ఉప్పలపాడు గ్రామ సమీపంలో సిమెంట్ భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని, గ్రామస్తులంతా ఏక తాటిపైకి వచ్చి సుముఖత వ్యక్తం చేస్తేనే.. ముందడుగు వేస్తామని, లేకుంటే వారి తీర్పును గౌరవిస్తామన్నారు.
రైతులు అంగీకరిస్తే శ్రీ సిమెంట్ లిమిటెడ్ నిర్వాహకులు 7,107 కోట్లతో నిర్మాణం చేపడతారని తెలిపారు. దీనితోపాటు మరో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు జమ్మలమడుగు నియోజకవర్గంలో రానున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దాల్మియా సిమెంట్ కర్మాగారానికి సంబందించి రెండవ ప్లాంట్ విస్తరణకు సంబందించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విషయం గుర్తు చేసారు.
శ్రీ సిమెంట్ కర్మాగారం యాజమాన్యం, గ్రామ రైతులతో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద శ్రీనివాసుల రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ నల్లంశెట్టి నాగార్జున, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




