Rayachoti: రాయచోటిలో ముమ్మరంగా రాత్రివేళ పోలీసుల గస్తీ, తనిఖీలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Oct 2026 12:12 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ముమ్మరంగా రాత్రివేళ పోలీసుల గస్తీ, తనిఖీలు!

Rayachoti: అన్నముయ్య జిల్లా రాయచోటి లో ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.గారి ఆదేశాల మేరకు నేరాల నివారణకు రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీ మరియు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.

రాత్రి విధులు నిర్వహించే సిబ్బందిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రహదారి భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటుగా, డ్రైవర్లు సురక్షితంగా గమ్యం చేరేందుకు "ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పదంగా ఎవరైనా లేదా ఏదైనా కనిపిస్తే వెంటనే 100 లేదా 112 కు కాల్ చేయాలని అధికారులు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI