Mydukuru: మల్లారెడ్డి కళాశాలలో కెరీర్ సక్సెస్‌పై స్ఫూర్తిదాయక సదస్సు!
Mydukuru: మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కెరీర్ సక్సెస్‌పై స్ఫూర్తిదాయక సదస్సు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన మైదుకూరు మెజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్.
Mydukuru: మల్లారెడ్డి కళాశాలలో కెరీర్ సక్సెస్‌పై స్ఫూర్తిదాయక సదస్సు!
మైదుకూరు: హైదరాబాద్‌లోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం బి.టెక్ విద్యార్థుల కోసం "బిల్డింగ్ ది విన్నింగ్ మైండ్‌సెట్ ఫర్ కెరీర్ సక్సెస్" (Building the Winning Mindset for Career Success) అనే అంశంపై స్ఫూర్తిదాయక ఉపన్యాస కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వక్తలు డాక్టర్. పసుపులేటి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
ఆయన ప్రసంగిస్తూ కెరీర్‌లో విజయవంతం కావడానికి విద్యార్థులు తమ మనసును, శక్తిని ఏ విధంగా సానుకూల మార్గంలో మలచుకోవాలో వివరించారు.
విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఈ సదస్సు చైతన్యాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవిలత, హెచ్ ఓ డి సువర్చల, ప్రవీణ్, రమణరావు, అశోక్, కళాశాల ఇతర విభాగాల బోధకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




