Lakkireddypalli: హెచ్‌ఐవీపై అవగాహనతోనే అపోహలకు చెక్
Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం. అవగాహనతోనే అపోహలు తొలగిపోతాయని ఎస్‌ఐ శోభారాణి, టీ. స్వాతి వెల్లడి.
Lakkireddypalli: హెచ్‌ఐవీపై అవగాహనతోనే అపోహలకు చెక్
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రజా చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్ట్ మేనేజర్ టీ. స్వాతి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ ఏయే మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఏయే పరిస్థితుల్లో వ్యాప్తి చెందదనే అంశాలను వివరించారు. హెచ్‌ఐవీపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా అపోహలను తొలగించవచ్చన్నారు.
హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపట్ల వివక్ష చూపకుండా గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు, చికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ జి. శోభారాణి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయవచ్చని కార్యక్రమంలో వివరించారు...




