Proddatur: బీసీలకే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠం: ప్రవీణ్ కుమార్ రెడ్డి

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాచమల్లుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Sept 2026 2:46 PM IST
Proddatur
X

Proddatur: బీసీలకే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠం: ప్రవీణ్ కుమార్ రెడ్డి

Proddatur: ​తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు మాజీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి కీలక విజ్ఞప్తి చేస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం అని, రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీసీలకే కేటాయించాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రవీణ్ కోరారు. ఈ ప్రతిపాదనకు స్థానిక కూటమి నాయకులంతా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

​కష్టపడిన వారికే గుర్తింపు: గత వైసీపీ ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొని, ధైర్యంగా నిలబడిన కౌన్సిలర్లకే చైర్మన్ పదవితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2019 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకే తొలి అవకాశం దక్కాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరుపై నూటికి నూరు శాతం టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ​తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు.

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో జరుగుతున్న ఫ్రాడ్‌ను మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది నేనేనని స్పష్టం చేసిన ప్రవీణ్.. "ఇప్పుడు నీకు డబ్బులు ముట్టలేదనే టౌన్ బ్యాంకుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నావా రాచమల్లు?" అని ప్రశ్నించారు. రాచమల్లు మానసిక పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR