Proddatur: ప్రొద్దుటూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం, గాంధీ పార్కులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 2 Oct 2026 10:30 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం మరియు గాంధీ పార్కులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. సత్యం, అహింసలనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు.

గాంధీజీ స్ఫూర్తితో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ​విశిష్ట అతిథిగా హాజరైన APNGO ప్రొద్దుటూరు అధ్యక్షులు రామసుబ్బయ్య మాట్లాడుతూ, పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ మంజునాధ్ గౌడ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాజేష్, యశోద, అసిస్టెంట్ ఇంజనీర్లు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్ వైజర్ నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR