Galiveedu: గాలివీడు ఓటర్లకు సుగవాసి ప్రసాద్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు

Galiveedu: గాలివీడు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో మద్దతు తెలిపిన ప్రజలకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Nov 2026 8:56 PM IST
Galiveedu
X

Galiveedu: గాలివీడు ఓటర్లకు సుగవాసి ప్రసాద్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు

గాలివీడు: నిన్న జరిగిన గాలివీడు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో నాకు మీ అమూల్యమైన మద్దతును, అభిమానాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు నాపై చూపించిన ఆదరణ… మీరు నాపై ఉంచిన నమ్మకం… మీరు అందించిన ప్రేమాభిమానాలు…ఇవన్నీ నా జీవితంలో ఎంతో విలువైనవి. మీ ప్రేమను, మీ అభిమానాన్ని, మీ ఆప్యాయతను ఎప్పటికీ మరువలేనని సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు.

ఎన్నికల ఫలితం ఏదైనా… మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మీ ఆశయాలకు, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. గాలివీడు మండల ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు! మీ ఆశీస్సులు, ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గాలివీడు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు కోరుకుంటున్నాను.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI