Galiveedu: కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: మండిపల్లి లక్ష్మీ ప్రసాద్!

Galiveedu: గాలివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిన్నమండెం మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Nov 2026 4:20 PM IST
Galiveedu
X

Galiveedu: కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: మండిపల్లి లక్ష్మీ ప్రసాద్!

గాలివీడు: గాలివీడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిన్నమండెం మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI