Galiveedu: స్థానిక ఎన్నికల వేళ పోలీసుల ఫ్లాగ్ మార్చ్!
Galiveedu: స్థానిక ఎన్నికల వేళ గాలివీడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని డీఎస్పీ కృష్ణమోహన్ పిలుపు, అల్లర్లకు పాల్పడితే చర్యలు హెచ్చరిక.
Galiveedu: స్థానిక ఎన్నికల వేళ పోలీసుల ఫ్లాగ్ మార్చ్!
గాలివీడు: రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో, లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్. కృష్ణంరాజు నాయక్ ఆధ్వర్యంలో బలగాలు బోరెడ్డిగారిపల్లె సహా పలు గ్రామాల మీదుగా కవాతు సాగించాయి.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జె. నరసింహారెడ్డి, జి. శోభ, కె.బి. శివకుమార్, సిబ్బంది పాల్గొని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.
ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.




