Proddatur: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా విజయం సాధించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 4 Nov 2026 1:05 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్!

Proddatur: ​మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ప్రజాస్వామ్యానికి పట్టిన దరిద్రమని, ఇది అసలైన విజయం కాదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, కలెక్టర్ యంత్రాంగం అనే 'పంచశక్తులు' ఏకమై అప్రజాస్వామిక విజయానికి సహకరించాయని ఆరోపించారు. నామినేషన్ పత్రాలు చింపేయడం, స్క్రూటినీ, అభ్యర్థుల ఉపసంహరణలో అక్రమాలు, బైండోవర్లు, దాడులు, రిగ్గింగ్, కౌంటింగ్ రోజు గందరగోళం సృష్టించి గెలిచారని మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన వారి పదవీకాలం 2029 జూన్ వరకేనని, 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థానిక సంస్థల ఫలితాలను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. బీసీలకు దక్కాల్సిన చైర్మన్ స్థానాన్ని ఓసీలకు కేటాయించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి లేఖ రాసి బీసీల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఆ లేఖ ఫోర్జరీ అని ఎమ్మెల్యే అనడంపై స్పందిస్తూ — తన మనవళ్లు, మనవరాళ్లపై ప్రమాణం చేసి చెప్పాలని లేదా ధైర్యముంటే మా పై కేసు పెట్టాలని సవాల్ విసిరారు. లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే నిజాలు తేలుతాయని, లేనిపక్షంలో ఎమ్మెల్యే తప్పు ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR