Proddatur: ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అరాచకాలు, కిడ్నాప్‌లు, అక్రమ కేసులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 24 Oct 2026 1:18 PM IST
Proddatur
X

Proddatur: ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు మరియు పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియగా, అన్ని చోట్లా అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుటుంబం వైసీపీ అభ్యర్థులపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందని మండిపాటు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే వారి పత్రాలు చింపివేశారని, టీడీపీ వాళ్ళు వైసీపీ వారిని కొట్టినా తప్పులేదా అని అక్రొషం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నారని వాపోయారు.

పొద్దుటూరు వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి ఓబన్న యాదవును కిడ్నాప్ చేస్తే తాము ఫిర్యాదు చేయడానికి వెళ్తే, పోలీసులు బాధితుడైన ఓబన్న యాదవ్ ను తిరిగి టీడీపీ వాళ్లకే అప్పగించారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఓబన్న యాదవ్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చారని (ఒకటి: డబ్బులు తీసుకొని తమకు సహకరించడం, లేదంటే రెండు: చంపేస్తామని బెదిరించారు.

ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి నరసింహారెడ్డిపై దాడి చేసిన వాళ్లపై ఎలాంటి కేసులూ లేవని, కానీ తమ పార్టీ వాళ్లపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తాము టీడీపీ వారి చేతిలో బాధితులమై ఉండి కూడా తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రతాప్, మళ్లీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాజాపాలెం మండలానికి చెందిన వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఓబులేసు నామినేషన్ వేస్తే, అతని కుటుంబ సభ్యులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా వైసీపీ చెల్లెళ్లను అసభ్యకరంగా ప్రవర్తిస్తే తమకు కోపం రాదా? దీనినే 'ధర్మ ఆగ్రహం' అంటారని హెచ్చరించారు. 2028 వరకు టీడీపీ వాళ్ళు ఎంత చేసినా తగ్గేది లేదని, ఆ తర్వాత మా తాహతేంటో చూపిస్తామని రాచమల్లు ఆక్రొషం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు, అక్రమాలు మరియు అన్యాయాలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు రాచమల్లు శివప్రసాదరెడ్డి వెల్లడించారు

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR