Proddatur: మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఫోర్జరీ ఆరోపణలు: వరదరాజుల రెడ్డి
Proddatur: తన సంతకం, లెటర్‌ప్యాడ్ ఫోర్జరీ చేసి నకిలీ లేఖ సృష్టించారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెల్లడించారు.
Proddatur: మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఫోర్జరీ ఆరోపణలు: వరదరాజుల రెడ్డి
Proddatur: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సంతకాన్ని, లెటర్ ప్యాడ్‌ను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారానికి చేస్తున్నాడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీలకు కాకుండా ఓసీ జనరల్‌కు కేటాయించాలని, తన తమ్ముడు రాఘవరెడ్డికి ఆ పదవి ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు రాసినట్లుగా ఒక నకిలీ లేఖను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ దొంగ లేఖ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బీసీల సంక్షేమంపై మాట్లాడే హక్కు రాచమల్లుకు లేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించారు. గత వైసీపీ హయాంలో భీమునిపల్లి లక్ష్మీదేవిని మున్సిపల్ చైర్మన్ చేసినప్పటికీ, ఆమెను కేవలం సంతకాలకే పరిమితం చేసి నిర్ణయాలన్నీ రచమల్లు కుటుంబ సభ్యులు తీసుకున్నారని మండిపడ్డారు.
చివరికి ఆమె ఎన్నికల ఖర్చు కోసం తన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని వరదరాజుల రెడ్డి తెలిపారు . ఫోర్జరీ సంతకాలు చేయడం, దొంగ లేఖలతో ప్రజలను, బీసీ వర్గాలను తప్పుదోవ పట్టించడం రాచమల్లుకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని రచమల్లు కు హెచ్చరించారు.




