Madanapalle: మదనపల్లె వెలుగు సంస్థలో స్నాక్స్ పంపిణీ!

Madanapalle: మదనపల్లె అమ్మచెరువుమిట్ట వెలుగు సంస్థలో ‘ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్’ సేవా కార్యక్రమం: దివ్యాంగులు, వృద్ధులకు స్నాక్స్ పంపిణీ, నిర్వాహకులకు ఘన సత్కారం.

Srinivasulu, Madanapalle
Published on: 24 Sept 2026 9:34 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె వెలుగు సంస్థలో స్నాక్స్ పంపిణీ!

మదనపల్లె: మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థను "ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ అఫ్ ఇండియా" మేనేజింగ్ డైరెక్టర్ బాసిద్ ఖాన్, డైరెక్టర్ సమీర్, టీం సభ్యులు ఖాజా, వాజీద్, అఫనన్, బెహజాద్, హబీబ్ సందర్శించారు. వెలుగు ప్రత్యేక పాఠశాలలోని దివ్యాంగులను, వృద్ధాశ్రమంలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.

గత కొన్నేళ్లుగా దివ్యాంగులు, వృద్ధులకు వెలుగు సంస్థ అందిస్తున్న సేవలను గుర్తించిన వారు, వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి స్నాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ సేవలను గుర్తించి దివ్యాంగులు, వృద్ధులకు స్నాక్స్ అందించినందుకు "ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ అఫ్ ఇండియా" ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

యువత ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు వెలుగు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులను శాలువాతో సత్కరించి మొమెంటో అందజేశారు. కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, సోషల్ వర్కర్ ఎం. గీత, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle