Proddatur: ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఖూనీ.. వైసీపీ ఓడలేదు, ప్రజలే ఓడిపోయారు!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారులు, పోలీసులు కుమ్మక్కై నామినేషన్లను తిరస్కరించారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Oct 2026 12:48 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఖూనీ.. వైసీపీ ఓడలేదు, ప్రజలే ఓడిపోయారు!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారులు, పోలీసులు, అధికార పక్షం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని ఆయన మండిపడ్డారు. 116 సంవత్సరాల ప్రొద్దుటూరు పురపాలక సంఘం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకగ్రీవాలు జరిగాయి.. ​వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదని, స్క్రూటినీకి కూడా రానివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చివరకు నా భార్య నామినేషన్ ఒక్కటే చెల్లుతుందంట" అని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో వైసీపీ వేసిన 88 నామినేషన్లలో 86 స్థానాలను తిరస్కరించారని, కేవలం 39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమాదేవి, రాజుపాలెం జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్లు మాత్రమే ఓకే చేశారని తెలిపారు.

బీసీలకు దక్కాల్సిన చైర్మన్ సీటును ఓసీకి దక్కేలా వరదరాజుల రెడ్డి మార్పించడంలో సపళీకృతమైంది అని ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, వరదరాజుల రెడ్డి వర్గం తప్పుచేశారని దుయ్యబట్టారు. వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్తే.. కలెక్టర్ మాత్రం ప్రొద్దుటూరులో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు అని మండిపడ్డారు. ​టిడిపికి గెలుపు కిక్ లేదు: "ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడలేదు, టీడీపీ గెలవలేదు.. ప్రజలే ఓడిపోయారు.

డిక్లరేషన్ పత్రాలు తీసుకుంటున్నప్పుడు టీడీపీ నేతల ముఖాల్లో కిక్కు లేదు, అధికారులకు పని లేకపోవడంతో ఆ కిక్ వచ్చింది" అని సెటైర్లు వేశారు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే నాయకులవుతారని, పోలీసులు గెలిపిస్తే రౌడీలవుతారని వ్యాఖ్యానించారు. అలాగే ఆది నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పై , "నేను కాదు భాష మార్చుకోవాల్సింది, మీరు బుద్ధి మార్చుకోండి" అని రాచమల్లు తెలిపారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR