Kadapa: జమ్మలమడుగులో స్వచ్ఛాంధ్ర కింద ఎలక్ట్రికల్ వాహనాల ప్రారంభం!

Kadapa: జమ్మలమడుగు మున్సిపాలిటీలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛాంధ్ర కింద 6 ఎలక్ట్రికల్ వాహనాల ప్రారంభం. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేతల విమర్శలు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 9 Oct 2026 10:31 AM IST
Kadapa
X

Kadapa: జమ్మలమడుగులో స్వచ్ఛాంధ్ర కింద ఎలక్ట్రికల్ వాహనాల ప్రారంభం!

Kadapa: కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా నూతనంగా ఆరు ఎలక్ట్రికల్ వాహనాలను సమకూర్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో గతంలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు, ఆటోలకు అదనంగా మరో ఆరు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, డాక్టరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బి.టెక్ చదివిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఇటీవల డీఎస్సీపై చేపట్టిన నిరసనలను ప్రస్తావిస్తూ,డీఎస్సీలో అవకతవకలు జరిగాయా అని ప్రశ్నించారు. వాస్తవాలను పక్కనపెట్టి లేని విషయాలను మాట్లాడుతున్నారని రామసుబ్బారెడ్డిపై విమర్శలు చేశారు.

అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆరు ఎలక్ట్రికల్ వాహనాలను అందించిందని తెలిపారు. వీటి ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టడంతో పాటు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU