Duvvuru: దువ్వూరు మండలంలో గ్రామాలకు విద్యుత్ బిల్ కలెక్టర్లు!

Duvvuru: దువ్వూరు మండలంలో విద్యుత్ బిల్లుల వసూలు కోసం గ్రామాలకు బిల్ కలెక్టర్లు. వినియోగదారుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ చర్యలని వెల్లడించిన కలెక్టర్!

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 19 Sept 2026 1:36 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు మండలంలో గ్రామాలకు విద్యుత్ బిల్ కలెక్టర్లు!

Duvvuru: దువ్వూరు మండల వరిధిలోని గ్రామాలలో విద్యుత్ బిల్లుల వసూల్ల కోసం మీ ప్రాంతాలకు విద్యుత్ బిల్ కలెక్టర్లు రానున్నట్లు మండల బిల్ కలెక్టర్ కశెట్టి నరసింహులు అన్నారు. శనివారం చిన్న సింగన పల్లె గ్రామంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల కోసం విద్యుత్ వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండ మీ ప్రాంతాలలో బిల్ కలెక్టర్ రావడం జరుగుతుందని, ఆ సమయంలో బిల్లులు చెల్లించని వారు దువ్వూరులొ విద్యుత్ బిల్లుల కార్యాలయంలో బిల్లులు చెల్లించవచ్చు అని అన్నారు. నెల కిందట డిజిటల్ పద్ధతిలో బిల్లులు చెల్లించాలని పెట్టడంతో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.

అలా కాకుండా ఆ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, మీయొక్క కరెంటు బిల్లులను త్వరగా చెల్లించి రసీదును తీసుకోవాలని దువ్వూరు బిల్ కలెక్టర్ కశెట్టి నరసింహులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న సింగన పల్లె జేఎల్ఎం నంద్యాల వరదరెడ్డి, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR