Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వాయిదా!
Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. నామినేషన్ కేంద్రంలో 19 నామినేషన్ పత్రాలను దుండగులు చించివేసిన ఘటనపై ఈ నిర్ణయం తీసుకుంది.
Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వాయిదా!
Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది. నామినేషన్ కేంద్రంలో 19 నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటనపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం అకస్మాత్తుగా ఓ మూక నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించి, 18 మంది అభ్యర్థులకు సంబంధించిన 19 నామినేషన్ పత్రాలను చించివేసింది. ఈ ఘటనను రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో నామినేషన్లు కోల్పోయిన 18 మంది అభ్యర్థులను తిరిగి నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు కోరారు. అయితే 21వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రీదేవి మాత్రమే తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికల సంఘం మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.




