Duvvuru: దువ్వూరు జడ్పీటీసీగా కారాపురెడ్డి లక్ష్మీదేవి నామినేషన్!

Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు జడ్పీటీసీ అభ్యర్థిగా కారాపురెడ్డి లక్ష్మీదేవి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో గెలుపే ధ్యేయమన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 22 Oct 2026 4:56 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు జడ్పీటీసీగా కారాపురెడ్డి లక్ష్మీదేవి నామినేషన్!

​దువ్వూరు: మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని దువ్వూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి కారాపు రెడ్డి లక్ష్మీదేవి గురువారం లాంఛనంగా నామినేషన్ దాఖలు చేశారు. ​ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో, క్లస్టర్ ఇన్‌చార్జ్-1 కారాపు రెడ్డి సంజీవ రెడ్డి దిశానిర్దేశంలో ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ​ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మీదేవి తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR