Duvvuru: దువ్వూరు జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ ఏకగ్రీవం
Duvvuru: దువ్వూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా జెర్రి గురుశేఖర్ యాదవ్, వైస్ చైర్మన్‌గా కటారి మహాలక్ష్మి రాయల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Duvvuru: దువ్వూరు జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ ఏకగ్రీవం
దువ్వూరు: స్థానిక దువ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన విద్యా కమిటీ ఎన్నికలు శనివారం ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా ముగిశాయి. గత నెల 29న అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియను శనివారం ఉపాధ్యాయులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం సభ్యులందరి ఆమోదంతో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా శ్రీ జెర్రి గురుశేఖర్ యాదవ్, వైస్ చైర్మన్‌గా శ్రీమతి కటారి మహాలక్ష్మి రాయల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కమిటీ ఏకగ్రీవంగా రూపుదిద్దుకోవడంపై ప్రధానోపాధ్యాయులు ఆవుల శ్రీనివాసులు, దువ్వూరు మండల విద్యాశాఖ అధికారి-1 (ఎంఈవో) కె. రమణయ్య, పట్టణ ఇన్‌ఛార్జ్ పాపినేని రాంబాబు, సంతోషం వ్యక్తం చేస్తూ, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శెట్టి నాగరాజు యాదవ్, మచ్చ శ్రీనివాసులు, తరిబోయిన రమేష్ యాదవ్, జెర్రీ గురు ప్రసాద్ యాదవ్, ఊటుకూరు కార్తీక్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం ఎన్నిక పట్ల గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు.




