Duvvuru: క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలి: తహసీల్దార్ సునీత!
Duvvuru: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి త్వరగా పరిష్కరించాలి: దువ్వూరు అధికారులకు తహసీల్దార్ బి. సునీత ఆదేశం. నిర్లక్ష్యంపై కఠిన హెచ్చరికలు.
Duvvuru: క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలి: తహసీల్దార్ సునీత!
మైదుకూరు దువ్వూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి నాణ్యమైన, పారదర్శకమైన పరిష్కారం చూపాలని తహసీల్దార్ బి. సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టాలని, కింది స్థాయి సిబ్బందికి ఆ బాధ్యత అప్పగించడం సరికాదని హితవు పలికారు.
కార్యాలయాల్లో అర్జీలు పెండింగ్‌లో ఉండకూడదని, సమస్యలు మళ్లీ 'రీ-ఓపెన్' కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రీ-ఓపెన్ అయిన దరఖాస్తులను మరింత నాణ్యతతో పరిశీలించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు తమ శాఖలకు వచ్చిన విజ్ఞప్తులపై నిరంతరం సమీక్ష జరపాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ (RWS) ఏఈ శివ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ సుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, ఉపాధి హామీ ఏపీఓ లక్ష్మీనారాయణ, హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




