Duvvuru: మహిషాసురమర్దిని అలంకారంలో శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం

Duvvuru: దువ్వూరు శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 7వ రోజు చండీ హోమం, కన్యకా పూజలు వైభవంగా జరిగాయి. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 18 Oct 2026 5:42 PM IST
Duvvuru
X

Duvvuru: మహిషాసురమర్దిని అలంకారంలో శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం

దువ్వూరు: దువ్వూరు లో ​శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.

​ఈ సందర్భంగా వాసవి మాతకు, పరమశివునికి మరియు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో చండీ హోమం, ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల చిన్నారుల చేత కన్యకా పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు.

​దర్శనార్థం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అమ్మవారి దర్శనం కల్పించారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రాత్రి 11:00 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR