Duvvuru: గజలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దువ్వూరు కన్యకా పరమేశ్వరి
Duvvuru: దువ్వూరు అమ్మవారిశాల ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి భక్తులకు శ్రీ గజలక్ష్మి దేవి విశేష అలంకారంలో దర్శనమిచ్చారు.
Duvvuru: గజలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దువ్వూరు కన్యకా పరమేశ్వరి
దువ్వూరు: దువ్వూరు పట్టణంలో దసరా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక మండల కేంద్రంలోని అమ్మవారిశాల ఆలయంలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి భక్తులకు శ్రీ గజలక్ష్మి దేవి విశేష అలంకారంలో దర్శనమిచ్చారు.
ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు లక్ష్మీ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ నిర్వహించి, అనంతరం మూలవిరాట్కు పంచామృతాభిషేకం, శాస్త్రోక్త ప్రత్యేక పూజలు గావించారు. గజలక్ష్మి అవతారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు దువ్వూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు. స్థానిక ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. భక్తుల నిరంతర నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది




