Duvvuru: వెలుగు కార్యాలయంలో పారిశుధ్యంపై అవగాహన సదస్సు
Duvvuru: దువ్వూరు వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాలకు పారిశుధ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తడి, పొడి చెత్త వేరుచేయాలని అధికారులు సూచించారు.
Duvvuru: వెలుగు కార్యాలయంలో పారిశుధ్యంపై అవగాహన సదస్సు
దువ్వూరు: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు దువ్వూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో తడి చెత్త మరియు పొడి చెత్తను వేర్వేరు బిన్లు, బ్యాగులలో భద్రపరిచి స్వచ్ఛ రథం వాహనానికి మాత్రమే అందజేయాలని సూచించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రభుత్వం నిర్వహించే ఐవిఆర్ఎస్ (IVRS) కాల్స్ ప్రాముఖ్యతను, వాటికి సరైన సమాధానం అందించాల్సిన విధానాన్ని మహిళా సంఘాల సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జవహర్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో హరికృష్ణ , వెలుగు ఏపీఎం వేణుగోపాల్ రెడ్డి మరియు పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) వెంకటేశ్వర్లు పాల్గొని సభ్యులకు పలు సూచనలు చేశారు. మండల పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.




