Duvvuru: ఎంపీటీసీ ఉప ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఆర్‌ఓ రవిచంద్రబాబు

Duvvuru: దువ్వూరు మండలంలో ఎంపీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పీఓలు, ఏపీఓలకు ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ. పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆర్‌ఓ రవిచంద్రబాబు సూచన.

A. VEERA BHUPAL, MYDUKUR
Updated on: 2 Nov 2026 4:57 PM IST
Duvvuru
X

Duvvuru: ఎంపీటీసీ ఉప ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఆర్‌ఓ రవిచంద్రబాబు

​దువ్వూరు: ఎన్నికల విధులపై సిబ్బంది పూర్తి అవగాహన, బాధ్యతాయుత దృక్పథంతో పనిచేయాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిచంద్రబాబు పిలుపునిచ్చారు. దువ్వూరు మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను, పోలింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, ప్రతి శిక్షణను కొత్త విషయాలు నేర్చుకునే అవకాశంగా భావించి బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి చిన్న లోపాలకు కూడా తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

​బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, సీలింగ్ తదితర అంశాలపై కేవలం సైద్ధాంతిక అవగాహనకే పరిమితం కాకుండా, సిబ్బంది చేత స్వయంగా ప్రయోగాత్మకంగా (ప్రాక్టికల్గా) చేయించి శిక్షణ పూర్తి చేయాలని మాస్టర్ ట్రైనర్లు ఎం. రాజశేఖర్, వై. రిజ్వాన్ అలీలను ఆదేశించారు. శిక్షణ సమయంలో సిబ్బంది వ్యక్తం చేసిన సందేహాలను ట్రైనర్లు ఎప్పటికప్పుడు నివృత్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసేందుకు అన్ని విభాగాల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు హరికృష్ణ, వెంకటరమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సంధ్యావాణి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR