Duvvuru: దువ్వూరులో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ!

Duvvuru: దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి మరియు గ్రామసభ నిర్వహణ. అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానాలు ఆమోదించిన అధికారులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 2 Oct 2026 1:38 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరులో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ!

Duvvuru: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దువ్వూరు మండల కేంద్రంలోని దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామసభ ను నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి .

​ఈ సందర్భంగా ముందుగా నిర్ణయించిన అజెండాలోని ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం "VB-G, RAM-G" పథకం కింద రాబోయే సంవత్సరంలో గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనుల ప్రాథమిక జాబితాను అధికారుల సమక్షంలో ప్రజలకు చదివి వినిపించారు. స్థానిక ప్రజల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయ ఉద్యోగులు, "VB-G, RAM-G" విభాగపు సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR