Duvvuru: గజలక్ష్మీదేవి అలంకారంలో ప్రసన్న కాళికామాత
Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు శ్రీ ప్రసన్న కాళికామాత ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Duvvuru: గజలక్ష్మీదేవి అలంకారంలో ప్రసన్న కాళికామాత
దువ్వూరు: స్థానిక మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్న కాళికామాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ నిర్వాహకులు డాక్టర్ తిరుమలరావు, రామలక్షుమ్మ దంపతులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గణపతి హోమం, విశేష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
గజలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో మార్మోగింది. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.




