Duvvuru: శ్రీ శారదా దేవి అలంకారంలో దువ్వూరు కాళికామాత
Duvvuru: దువ్వూరు శ్రీ కాళికాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు శ్రీ శారదా దేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Duvvuru: శ్రీ శారదా దేవి అలంకారంలో దువ్వూరు కాళికామాత
దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ కాళికాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడవ రోజు అమ్మవారు శ్రీ శారదా దేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, శాస్త్రోక్త హోమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్థానిక మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
నవరాత్రులను పురస్కరించుకుని కాళికామాత అమ్మవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ నిర్వాహకులు డాక్టర్ తిరుమలరావు, రామాలక్షుమ్మ దంపతులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.




