Duvvuru: విద్యార్థులకు పౌష్టికాహారమే లక్ష్యం: డీఈవో షంషుద్దీన్

Duvvuru: దువ్వూరు ZPHS పాఠశాల, కేంద్రీకృత స్మార్ట్ కిచెన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో షంషుద్దీన్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 7 Oct 2026 5:56 PM IST
Duvvuru
X

Duvvuru: విద్యార్థులకు పౌష్టికాహారమే లక్ష్యం: డీఈవో షంషుద్దీన్

​దువ్వూరు: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) షంషుద్దీన్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)ను ఆయన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.

​ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) నిర్వహణను, కేంద్రీకృత స్మార్ట్ కిచెన్‌ను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భోజన తయారీ విధానం, ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన అనంతరం సిబ్బందికి, విద్యాశాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

​వంటల తయారీకి కేవలం తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని డీఈవో ఆదేశించారు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండాలని, వంటశాల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో వేడివేడిగా భోజనం అందేలా మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు రమణయ్య, భాస్కర్, ప్రధానోపాధ్యాయులు ఆవుల శ్రీనివాసులు , వెలుగు సిసి అమర్నాథ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR