Duvvuru: దువ్వూరు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర పదవులు నియామకం

Duvvuru: దువ్వూరుకు చెందిన అందే శ్రీనివాసులు, మారుగాని సురేష్ యాదవ్‌లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర స్థాయి కీలక పదవులకు నియమితులయ్యారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 Oct 2026 7:01 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర పదవులు నియామకం

​దువ్వూరు: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో దువ్వూరు గ్రామానికి చెందిన ప్రముఖులకు కీలక బాధ్యతలు దక్కాయి. రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మారుగాని సురేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అందే శ్రీనివాసులు రాయల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మాలి కాంతారావు చేతుల మీదుగా వారు నియామక పత్రాలను అందుకున్నారు.

​ఈ సందర్భంగా శుక్రవారం దువ్వూరులో వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫోరం అధ్యక్షులు బొమ్మాలి కాంతారావుకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR