Duvvuru: దువ్వూరు అమ్మవారిశాలలో శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు!

Duvvuru: దువ్వూరు అమ్మవారిశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివరాలు చదవండి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 15 Oct 2026 5:59 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు అమ్మవారిశాలలో శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు!

Duvvuru: స్థానిక మండల కేంద్రంలోని అమ్మవారిశాల ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలితాదేవి (తోటోత్సవం) విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు.

​ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు గొల్ల పిన్ని లక్ష్మీనరసింహమూర్తి సుప్రభాత సేవ నిర్వహించి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు జరిపించారు. అనంతరం అమ్మవారిని లలితాదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దువ్వూరు పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

​ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్యవైశ్య సభ పాలకవర్గం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. స్థానిక ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సహకారం అందించడంతో పాటు తీర్థప్రసాదాల వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR