Duvvur: దువ్వూరులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

Duvvur: దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి ఇరగంరెడ్డి చంద్రకళ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచం గుర్తుకు ఓటు అభ్యర్థన.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 29 Nov 2026 6:24 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

​దువ్వూరు: మండల పరిధిలోని చిన్న సింగనపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఇరగంరెడ్డి చంద్రకళను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండల పార్టీ అధ్యక్షులు ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, ఇరగంరెడ్డి రెడ్డి పద్మనాభ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు.

​చిన్న సింగనపల్లెతో పాటు గొల్లపల్లి, ఎల్లాల కొట్టాలు, చిన్న సింగనపల్లె ఎస్సీ కాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. అభ్యర్థికి కేటాయించిన 'మంచం' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

సర్పంచ్ అభ్యర్థి ఇరగంరెడ్డి చంద్రకళ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ 'మంచం' గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

​ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షులు సంగన లక్ష్మీనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు ఇరగంరెడ్డి పద్మనాభ రెడ్డి, నారుపల్లె విజయభాస్కర్ రెడ్డి, సంగన హరినాథ్ రెడ్డి, బొమ్ము ఓబుల్ రెడ్డి, అమ్మిరెడ్డి వెంకట నాగిరెడ్డి, నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి లతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR