Duvvur: సమ్మెబాట పట్టిన వీఆర్ఏలు - తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

Duvvur: దువ్వూరులో సమ్మెబాట పట్టిన వీఆర్ఏలు. పే స్కేల్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 17 Sept 2026 10:46 AM IST
Duvvur
X

Duvvur: సమ్మెబాట పట్టిన వీఆర్ఏలు - తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

దువ్వూరు: దువ్వూరు మండల వీఆర్ఎ లు సమ్మెబాటను పట్టారు, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దువ్వూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా విఆర్ఎల సంఘం అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ, వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయా లని, నామినీ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని వీఆర్ఎలుగా నియమించా లని, అర్హత కలిగిన వారికి వీఆర్వో, వాచ్ మెన్లు, ఆఫీస్ సబార్డినేట్ తదితర పదోన్నతులు కల్పించాలని,

విధి నిర్వహణలో మరణించిన వీఆర్ఎల కుటుంబ స భ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని, ఇతర పెండింగ్ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వీఆర్ఎ లు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR