Duvvur: దువ్వూరు ఎంపీపీగా వడ్లాని వెంకటరమణ ఘన ప్రమాణ స్వీకారం!

Duvvur: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండల పరిషత్ నూతన అధ్యక్షురాలిగా వడ్లాని వెంకటరమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప మండలాధ్యక్షుడిగా అందె శ్రీనివాసులు ఎన్నికయ్యారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 19 Nov 2026 3:54 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరు ఎంపీపీగా వడ్లాని వెంకటరమణ ఘన ప్రమాణ స్వీకారం!

దువ్వూరు: దువ్వూరు మండల పరిషత్ నూతన అధ్యక్షులు గా (ఎంపీపీ) వడ్లాని వెంకటరమణ పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) సురేంద్రబాబు అసిస్టెంట్ ఆర్వో జవహర్ బాబు ఆధ్వర్యంలో ప్రమాణస్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. తొలుత మండలంలోని 15 మంది ఎంపీటీసీ సభ్యులతో ఆర్.ఓ సురేంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా వడ్లాని వెంకటరమణ ప్రమాణం చేశారు.

​ప్రమాణస్వీకార ప్రక్రియ ముగిసిన వెంటనే, నిబంధనల ప్రకారం ఉప మండలాధ్యక్ష (వైస్ ఎంపీపీ) పదవికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో ఎంపీటీసీ సభ్యులంతా కలిసి అందె శ్రీనివాసులును ఉప మండలాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనతో కూడా ఆర్.ఓ ప్రమాణస్వీకారం చేయించారు.

నూతన పాలకవర్గం కొలువుదీరడంతో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ వడ్లాని వెంకటరమణ, వైస్ ఎంపీపీ అందె శ్రీనివాసులుకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR