Duvvur: దువ్వూరు గుడిపాడులో వైభవంగా శివలింగ దీపోత్సవం
Duvvur: దువ్వూరు మండలం గుడిపాడు కొత్త రామాలయంలో కార్తీక పౌర్ణమి శివలింగ దీపోత్సవం; 365 వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు.
Duvvur: దువ్వూరు గుడిపాడులో వైభవంగా శివలింగ దీపోత్సవం
దువ్వూరు: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో శివలింగ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రామంలోని కొత్త రామాలయం ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేడుకలలో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపాలను శివలింగం ఆకారంలో అందంగా అమర్చారు. అనంతరం ఆ దీపాలలో వత్తులను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
కార్తీక పౌర్ణమి విశిష్టతను చాటుతూ గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి 365 వత్తులను వెలిగించి, తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. దీపాల కాంతులతో గుడిపాడు లోని కొత్త రామాలయంలో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.




