Duvvur: శనివారం ఘనంగా దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు

Duvvur: దువ్వూరులో శనివారం దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అన్నదానం, జెండా ఊరేగింపు, ఖవ్వాలీ కార్యక్రమాలు ఉంటాయని కమిటీ తెలిపింది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 Oct 2026 9:30 PM IST
Duvvur
X

Duvvur: శనివారం ఘనంగా దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు

​దువ్వూరు: స్థానిక మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కొలువైన శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుబహాని (దస్తగిరి స్వాముల) దర్గా గ్యార్మీ జెండా మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.

​శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దర్గా వీధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటలకు స్థానిక ఉర్దూ పాఠశాల వద్ద నుంచి ఫకీర్ల మేళతాళాల నడుమ దువ్వూరు పురవీధుల్లో జెండా ఊరేగింపు వైభవంగా సాగుతుందని వెల్లడించారు.

అనంతరం రాత్రి 10:30 గంటల నుంచి ప్రముఖ కళాకారులతో భారీ ఖవ్వాలీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR