Duvvur: దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం!

Duvvur: దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి ముమ్మర ప్రచారం. కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరిన నాయకులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 31 Oct 2026 7:51 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం!

Duvvur: దువ్వూరు మండలం నీలాపురం ఎంపీటీసీ స్థానంలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి తమ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని, మంచి మెజారిటీని ప్రజలు అందివ్వాలని కోరుతూ నీలాపురం ఎంపీటీసీ పరదిలోని దాసరిపల్లె గ్రామంలో శనివారం ముమ్మరంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అభ్యర్థి మనోహర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, బిజెపి నాయకులు భాస్కర్ రెడ్డి, లక్ష్మయ్య యాదవ్,దువ్వూరు మండల బిజెపి నాయకులు పల్లె సుబ్బారెడ్డి, అమ్మిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి,బాలనాగిరెడ్డి, రంగనాధ్, కేశవరెడ్డి మరియు పార్టీ శ్రేణులు కలిసి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు.బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డి కమలం గుర్తుకు ఓటు వేయాలని వారు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR