Rayachoti: వాసవి ఆలయ దసరా ఉత్సవాలకు డాక్టర్ మండిపల్లికి ఆహ్వానం
Rayachoti: రాయచోటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డిలను ఆర్యవైశ్య సంఘం ఆహ్వానించింది.
Rayachoti: వాసవి ఆలయ దసరా ఉత్సవాలకు డాక్టర్ మండిపల్లికి ఆహ్వానం
Rayachoti: రాయచోటిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ గారు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, మౌర్యా రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.




