Rayachoti: నూతన బోరును ప్రారంభించిన డా. లక్ష్మీప్రసాద్ రెడ్డి!

Rayachoti: జమాలుల్లా బాబా దర్గాలో నీటి సమస్య పరిష్కారానికి బోరు వేయించి ప్రారంభించిన డా. లక్ష్మీప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Oct 2026 8:14 PM IST
Rayachoti
X

Rayachoti: నూతన బోరును ప్రారంభించిన డా. లక్ష్మీప్రసాద్ రెడ్డి!

రాయచోటి: జమాలుల్ల బాబా దర్గా కమిటీ వారు దర్గా ప్రాంగణంలో నీటి సౌకర్యం లేనందువల్ల తద్వారా దర్గాకు ప్రార్థనలు వచ్చే ముస్లిం సహోదరులు సహోదరీమణులు ఇబ్బందులు పడుతున్నారని గౌరవ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని సంప్రదించగా...వెంటనే ఆయన బోర్ బండిని పంపించి బోర్ వేయడం జరిగింది.

దర్గా కమిటీ వారు దర్గా నందు నీటి సౌకర్యాన్ని కల్పించినందుకు గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మరియు గౌరవ డాక్టర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి* గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

అనంతరం దర్గా కమిటీ వారు గౌరవ డాక్టర్ లక్ష్మీప్రసాద రెడ్డి గారికి మరియు గాజుల ఖాదర్బాషా గారికి శాలువ కప్పి ఘనంగా సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేసినారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సంఘసేవకర్త మైనుద్దీన్ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ బర్కత్ తెలుగుదేశం పార్టీ 19వ వార్డు అధ్యక్షుడు సాగీర్, అమీర్ భాష,రఫీ తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI