Galiveedu: వెలిగల్లు కాలువ నుంచి చెరువుకు నీటి పంపింగ్ ప్రారంభం

Galiveedu: గాలివీడు మండలం గుండ్లచెరువులో వెలిగల్లు కుడి కాలువ నుంచి చెరువుకు నీటి పంపింగ్ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 10 Oct 2026 3:53 PM IST
Galiveedu
X

Galiveedu: వెలిగల్లు కాలువ నుంచి చెరువుకు నీటి పంపింగ్ ప్రారంభం

గాలివీడు: గాలివీడు మండలం గుండ్లచెరువు గ్రామం, దుగ్గనవారిపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వెలిగల్లు కుడి కాలువ నుంచి పైపులైన్ ద్వారా చెరువుకు నీటిని పంపింగ్ చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ నీటి సరఫరా ద్వారా చెరువు కింద ఉన్న పంట పొలాలు సాగులోకి వచ్చి, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైతుల సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడనుంది. గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించి సాగునీటి సౌకర్యం కల్పించడంపై స్థానిక రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI