Jammalamadugu: మీ నిర్లక్ష్యాన్ని మాపై రుద్దొద్దు: భూపేష్ రెడ్డి
Jammalamadugu: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఓటు నమోదు చేసుకునేవారని, తమ నిర్లక్ష్యాన్ని టీడీపీపై రుద్దొద్దని భూపేష్ సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు.
Jammalamadugu: మీ నిర్లక్ష్యాన్ని మాపై రుద్దొద్దు: భూపేష్ రెడ్డి
Jammalamadugu: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే సదుద్దేశం మీలో ఉంటే ఎప్పుడో ఓటు నమోదు చేసుకుని కోర్టు ద్వారా కావలసిన అర్హతలను సమకూర్చుకునేవారని.. అలా కాకుండా మీ నిర్లక్ష్యాన్ని మా పై రుద్దడం సరికాదని జిల్లా టిడిపి అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ధ్వజమెత్తారు.
కడప జిల్లా జమ్మలమడుగులో జిల్లా టిడిపి అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య ఇందిరమ్మ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ అభ్యర్థులతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందన్నారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు సైతం పోటీలో నిలిచారని తెలిపారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య ఇందిరమ్మ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదని, తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
పొన్నపు రెడ్డి శివారెడ్డి కూతురు హైమావతి సైతం నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఓటరు ప్రజాస్వామ్యబద్ధంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు మంచి చేసిన అభ్యర్థులను గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.




