Duvvur: జిలెల్ల, ఏ.ఎస్.పల్లి వీహెచ్‌సీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీ
Duvvur: వైఎస్సార్ కడప జిల్లా జిలెల్ల, ఏ.ఎస్.పల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్య సేవలపై సమీక్షించింది.
Duvvur: జిలెల్ల, ఏ.ఎస్.పల్లి వీహెచ్‌సీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీ
దువ్వూరు: వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు, చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని జిలెల్ల, అన్నపుశాస్త్రుల పల్లి (ఏ.ఎస్.పల్లి) విలేజ్ హెల్త్ క్లినిక్‌లను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సందర్శించి ఆరోగ్య సేవలు, రికార్డుల నిర్వహణను తనిఖీ చేసింది.
ఈ సందర్భంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణతో వైద్య సేవలు అందించాలని సూచించింది. MCP కార్డుల్లో గర్భిణుల ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు, RCH పోర్టల్‌లో గర్భిణి నమోదు నుంచి ప్రసవానంతర సంరక్షణ వరకు అన్ని సేవలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని తెలిపింది.
చిన్నారులకు నిర్ణీత సమయంలో టీకాలు అందించడం, టీకాలు మిస్ అయిన పిల్లలను గుర్తించడం, U-WIN పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడం, 102, 108, 104 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిర్వహిస్తున్న రికార్డులు, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో పెండింగ్ సేవలను పరిశీలించి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని సూచించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, డి.పి.ఓ. నారాయణ, రాజశేఖర్, సూపర్‌వైజర్ రాఘవ, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లేష్, వైద్యాధికారి డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ వికసిత డాక్టర్ హేమలత, ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు, శివ గంగ రాజు, రాజేశ్వరమ్మ,మల్లేశ్వరి, ఆరోగ్య సహాయకులు జనార్దన్ రావు రవికుమార్ సిహెచ్ఓలు, ఏఎన్ఎమ్స్ ఆశా కార్యకర్తలు గర్భణిలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




