Duvvur: దువ్వూరు శ్రీ వాసవీ ఆలయంలో దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ!

Duvvur: దువ్వూరు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 5 Oct 2026 6:51 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరు శ్రీ వాసవీ ఆలయంలో దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ!

Duvvur: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు, ఆలయ అర్చకులు గొల్ల పిన్ని లక్ష్మీనరసింహమూర్తి ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ ఆదివారం నుండి 20వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పది రోజుల పాటు శాస్త్రోక్తంగా విశేష పూజలు, ప్రతిరోజూ వివిధ రూపాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు.

​ముగింపు రోజైన అక్టోబర్ 20న శమీపూజ (జమ్మి దర్శనం) అనంతరం మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి, కృపకు పాత్రులు కావాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ ప్రతినిధులు వి.వి. స్వామి, లింగం పట్టాభి రామయ్య, ఆరవేటి రవీంద్రనాథ్, దేవతి రాము, రవ్వ అశోక్ కుమార్, ఈపూరి సత్యనారాయణ, యాదాల రామకృష్ణ, ఈపూరి శివయ్య, ఆరవేటి నాగేశ్వరరావు, కొప్పోలు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR