Duvvur: దువ్వూరు కాళీమాత ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు

Duvvur: దువ్వూరు కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు భవానీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Oct 2026 5:04 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరు కాళీమాత ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు

​దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ కాళీమాత దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు ఆలయ నిర్వాహకులు డాక్టర్ తిరుమలరావు, రామలక్ష్మమ్మ దంపతులు తెలిపారు.

​ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ భవానీ దేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు, కర్పూర నీరాజనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR