Rayachoti: కోర్టు భవనాలు కూల్చేంత అధ్వానంగా లేవు: జిల్లా జడ్జి రాంగోపాల్
Rayachoti: రాయచోటి పాత కోర్టు భవనాలను కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్. రాంగోపాల్ పరిశీలించారు; కూల్చేంత అధ్వాన స్థితిలో లేవని, రిపేర్లతో కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
Rayachoti: కోర్టు భవనాలు కూల్చేంత అధ్వానంగా లేవు: జిల్లా జడ్జి రాంగోపాల్
Rayachoti: రాయచోటి పాత కోర్టు భవనాలను కూల్చివేసి అదే స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని వచ్చిన ప్రతిపాదనను పరిశీలించడానికి కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్ రామ్ గోపాల్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాయచోటి కోర్టు భవనాల వద్దకు వచ్చి పరిశీలించారు.
కోర్టు భవనాలను పరిశీలించిన అనంతరం ఆయన ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. భవనాలు కూల్చే అంతగా అద్వాన్న స్థితిలో లేవని మైనర్ రిపేర్లు చేస్తే మరో 20 సంవత్సరాలు పాటు పాత బిల్డింగ్ లోనే రాయచోటి కి సంబంధించిన మూడు కోర్టులను జరపవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు రోడ్లు భవనాల శాఖ డి. ఈ. ని పిలిపించి బిల్డింగ్ పనికిరాదని ఎవరు సర్టిఫై చేశారని ఆరా తీశారు.
అవసరమైతే రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక ప్రత్యేక టీం ద్వారా మరింత లోతుగా బిల్డింగ్ పై అధ్యయనం చేయించి రిపేర్లు చేయించిన అనంతరం ఐదవ జిల్లా జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇక్కడే జరిగే విధంగా ఏర్పాట్లు చేసుకుందామని రాయచోటి న్యాయవాదులతో ఆయన అన్నారు.
అవసరం అనుకుంటే ప్రస్తుతం నూతన బిల్డింగ్ లో జరుగుతున్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనంలో ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టును జరుపుకుందామని న్యాయమూర్తి అన్నారు. పూర్తి సమాచారంతో న్యాయవాదులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆయన సూచించారు.




